ఎల్లార్తి స్కీమ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్వహణ కొరకు భూమిపూజ
1 min read
న్యూస్ నేడు హొళగుంద : ప్రజల దాహార్తి తీర్చేటి నీటి నిల్వ కేంద్రం ఎల్లార్తి వాటర్ స్కీమ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్వహణ కొరకు టెండర్ దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ యువనాయకులు చిన్నహ్యాట అశోక్, తెలుగుయువత మాజీ రాష్ట్ర నాయకులు చిన్నహ్యట శేషగిరి మరియు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి విష్ణువర్థన్ రెడ్డిల ఆధ్వర్యంలో టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, మాజీ కన్వీనర్ దుర్గయ్య, టిడిపి సీనియర్ నాయకులు దాసరి సీతయ్య, గాదిలింగ గౌడ్,తిక్కప్ప, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి, క్లస్టర్ ఇంచార్జ్ వీరేంద్ర,ఖాదర్ బాష, హెబ్బటం ఉపసర్పంచ్ సవారప్ప, కురువ గోపాల్,నాగయ్య,బోయ కాళప్ప మల్లికార్జున,బుడుగజంగాల లక్ష్మన్న, కురువ మల్లి,గిరి,చిదానంద,టి.యన్. యస్.యఫ్ మల్లి,ఐ.టిడిపి నాగేంద్ర,భాస్కర్, గోవిందు, గంగయ్య, మల్లయ్య మరియు కొగిలతోట, మార్లమాడికి, సమ్మతగేరి, పెద్దహ్యట,ఎల్లార్తి, హొళగుంద తదితర గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల సమక్షంలో శనివారం టెండరు దారులు ఘనంగా భూమిపూజ నిర్వహించి నిర్వహణ పనులను ప్రారంభించారు.

