చింతమనేని ప్రభాకర్ కు ఊరట !
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలుగు దేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారం రోజుల క్రితం చింతలపూడిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేనిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా కేసు పై తదుపరి చర్యలను నిలిపి వేస్తూ ధర్మాసనం స్టే ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్ తరుపున హైకోర్టులో పోసాని వెంకటేశ్వర్లు, కె.ఎం.కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.