NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిగ్ బాస్ విజేత క‌న్నుమూత

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బాలీవుడ్ న‌టుడు, బిగ్ బాస్-13 విజేత సిద్ధార్థ్ శుక్లా క‌న్నుమూశారు. గురువారం ఉద‌యం గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ క్రమంలో ఆయ‌న క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు తెలిపారు. సిద్ధార్థ్ మృతితో బాలీవుడ్ లో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి. ప‌లువురు సినీ ప్రముఖులు ఆయ‌న‌కు నివాళి అర్పించారు. ఇంటీరియ‌ర్ డిజైన్ లో గ్రాడ్యుయేష‌న్ పూర్తీ చేసిన ఆయ‌న సినిమాల‌పై ఆస‌క్తితో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ప‌లు చిత్రాల్లో స‌హాయ న‌టుడిగా న‌టించారు. బాలిక వ‌ధు, దిల్ సే దిల్ త‌ఖ్ సీరియ‌ల్స్ తో ప్రజ‌ల‌కు చేరువ‌య్యారు. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ -13 విజేత‌గా నిలిచారు. ఆయ‌న చివ‌రి షో బ్రోక‌న్ బట్ బ్యూటీఫుల్ 3.

About Author