NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుగవాసి ప్రసాద్ బాబు ను ఘనంగా సత్కరించిన బిజెపి నాయకులు

1 min read

కూటమి నాయకులు ఆత్మీయ కలయికకు వేదికగా టీడీపీ కార్యాలయం

అన్నమయ్య జిల్లా నవంబర్ 13 (సి  వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని రాయచోటి పట్టణంలో గాలివీడు రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ని శుక్రవారం అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు పులి నరేంద్రకుమార్ రెడ్డి , జడ్పీటీసీ సభ్యులు జబ్బాల శ్రీనివాసులు  బీజేపీ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు కి పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం సుగవాసి ప్రసాద్ బాబు  సైతం పులి నరేంద్రకుమార్ రెడ్డి ని, జబ్బాల శ్రీనివాసులు ని శాలువాలతో సత్కరించి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ భేటీ సందర్భంగా నాయకుల మధ్య పరస్పర గౌరవం, ఆత్మీయ పలకరింపులు వెల్లివిరిశాయి. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి సమన్వయం, పార్టీ బలోపేతం వంటి అంశాలపై సానుకూలంగా చర్చించుకున్నారు.పార్టీల మధ్య సమన్వయం… నాయకుల మధ్య స్నేహబంధం… ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేయాలనే సంకల్పం!టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ ప్రజాసేవ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలనే ఆకాంక్ష ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతిబింబించింది.ఈ కార్యక్రమంలో రాయచోటి బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ పాలగిరి శ్రీనివాసరాజు, నిర్మల్ కుమార్, బీజేపీ నాయకులు రేపన శివ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *