అభివృద్ధి సంక్షేమ ప్రదాతను ఆశీర్వదించండి
1 min read– సీకే దిన్నే జడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి అన్నారు, బుధవారం మండలంలోని గుర్రంపాడు గ్రామపంచాయతీలో( ఓబులంపల్లె, నజీర్ బేగ్ పల్లె) తన తండ్రి పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగిందన్నారు, ప్రతి ఇంటికి ప్రభుత్వం తరఫున లబ్ధి జరిగి ఉంటేనే తనకు ఓటు వేయాలని చెప్పే దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి చేయలేదని జన్మభూమి కమిటీలతో తనవారికి లబ్ధి చేకూర్చుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , అర్హులు అయితే చాలు కులాలకు మతాలకు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు, రాజకీయ అవసరాల కోసం ప్రజల్లోకి వచ్చి ఎన్నో దొంగ హామీలు ఇచ్చి మోసగించే వారి కన్నా, తను మేనిఫెస్టో లో ఏవైతే చెప్పడం జరిగిందో వాటిని ఒక భగవద్గీతగా, ఒక కురానుగా, ఒక బైబిల్ గా చెప్పినవన్నీ చెప్పినట్లు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు, అవ్వ తాతలు, అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అందరూ ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ చల్ల వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్ చల్లా ప్రమీల, వైఎస్ఆర్సిపి యువ నాయకులు, చల్ల అన్వేష్ రెడ్డి, చంద్ర ఓబుల రెడ్డి, కమలాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సాగర్ రెడ్డి, శివారెడ్డి, పెనుబాల వెంకట సుబ్బమ్మ, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, జి ఎన్ భాస్కర్ రెడ్డి, గణేష్ రెడ్డి, ఆర్ వి ఎస్ ఆర్, గుమ్మల్ల సాయి రెడ్డి, ప్రదీప్ రెడ్డి, మైనార్టీ నాయకులు, అన్వర్ భాష, జుమన్, వారిస్, సాదిక్అలీ, హస్రత్, తదితరులు పాల్గొన్నారు.