గాలిపటంతో పాటు ఎగిరిపోయాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంకలోని పాయింట్ పెడ్రో ప్రాంతంలో భారీ పతంగుల పోటీ జరుగుతోంది. ఓ యువకుల బృందం అతి పెద్ద పతంగిని ఎగరేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సరిగ్గా పతంగి ఎగిరే సమయానికి దాని తాడును ఆ బృందంలోని ఓ యువకుడు గట్టిగా పట్టుకోవడంతో అతడూ 30 అడుగులు పైకి ఎగిరిపోయాడు. తాడును వదిలేయాలని కింది నుంచి అతడి స్నేహితులు కేకలు వేశారు. చివరకు పతంగి కొంత కిందకు వచ్చాక తాడును వదిలేయడంతో దాదాపు 10 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న ఇసుకలో పడి బతికిపోయాడు.