వైసీపీ నుంచి టీడీపీ లోకి బొల్లెద్దుల కుటుంబాలు
1 min read– ఏబీఎం పాలెంలో వైసీపీకి షాక్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ నందికొట్కూరు మున్సిపాలిటీ లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి.మున్సిపాలిటీ లోని ఏబీఎం పాలేం కాలనీకి చెందిన సుమారు 30 దళిత కుటుంబాలకు వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మండలం లోని అల్లూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్సి ఎస్టీ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న ఆధ్వర్యంలో బొల్లెద్దుల కుటుంబానికి చెందిన వైసీపీ కార్యకర్తలు బొల్లెద్దుల జంబులయ్య, శేఖర్, పెద్ద జంబులు, బాలస్వామి, భాస్కర్, రమణ తదితరులు టీడీపీ పార్టీలో చేరారు. మాండ్ర శివానంద రెడ్డి వారికి టీడీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కష్టపడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టాడని విమర్శించారు, రాష్ట్ర అభివృద్ధి జరగలేదని తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు మాండ్ర శివానంద రెడ్డి, గౌరు వెంకట రెడ్డి నాయకత్వం నచ్చి టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు.