PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రగ్స్​ కేసులో బాలివుడ్​ బాద్​షా తనయుడు ఆర్యన్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, ముంబయి: బాలివుడ్​ బాద్​షా షారూఖ్​ఖాన్ తనయుడు ఆర్యన్​ మెడకు డ్రగ్స్​ కేసు చుట్టకుంది. శనివారం ముంబయి తీరాన కార్డిలియా క్రూయిజ్​ లైనర్​ అనే భారీ నౌకలో రేవ్​ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు ముంబయి ఎన్​సీబీ(నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) అధికారులు దాడులు చేసి డ్రగ్స్​ వినియోగిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారూఖ్​ఖాన్​ కుమారుడు ఆర్యన్​ఖాన్​ ఉన్నట్లు గుర్తించారు. సదరు నౌక ముంబయి నుంచి గోవా వెళుతోన్నక్రమంలో ఎస్​సీబీ మెరుపు దాడి చేసి డ్రగ్స్​ గుట్టును బయటపెట్టింది. అదుపులోకి తీసుకున్న వారి నుంచి పలురకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్​కు డ్రగ్స్​ వ్యవహారంలో లింకులు ఉన్నట్లుగా ఎన్​సీబీకి బలమైన ఆదారాలు లభించనట్లుగా తెలుస్తోంది.

About Author