PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ జ్ఞాని డా.బి.ఆర్​.అంబేద్కర్​కు ఘననివాళి

1 min read

బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్

పల్లెవెలుగు, ఏలూరు:  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విశ్వ జ్ఞాని, కరుణా సంపన్నుడు, నైతికత మార్గ నిర్దేశకుడని  బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.  డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ వర్ధంతి 67వ సందర్బంగా  బుధవారం ఏలూరు జెవియర్ నగర్ లో  సంఘిక సంక్షేమ బాలికల వసతి  గృహంలో వర్ధంతి సభ నిర్వహించారు.  అంబెడ్కర్ విగ్రహానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎ.ఎస్.డబ్ల్యూ బి. రమేష్ , మానిటరింగ్ సభ్యులు అజయ్ బాబు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాజేంద్ర మాట్లా డుతూ ఆధునిక కాలంలో మరుగు చేయబడిన బౌద్దాన్ని పునరుద్ధరణ చేసిన ధీశాలి, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ప్రాతినిధ్యపు హక్కును శాశ్వతంగా ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా మనువాదులు పసి గట్టకుండా హక్కు కల్పించిన దార్శినిక నేత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని కొనియాడారు. సాంఘీక వేత్త మెతర అజయ్ బాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ జీవించిన కాలం కంటే, వారి పరి నిర్వాణం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కావించబడిన పూలే-అంబేడ్కర్ భావజాలం అత్యంత ప్రభావితంగా చాలామంది మనసుల్లో తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పారు. మతం ద్వారా స్థిరీకరించబడిన కులాన్ని నిర్మూలించకుండా పీడీత కులాలు పాలక కులాలుగా ఎదగలేరన్న వాస్తవాన్ని సమాజానికి అర్థమంత వంతమైన విధంగా 1936లోనే కుల నిర్మూలన పుస్తకం ద్వారా బహుజనులకు చాటి చెప్పారన్నారు. ఎ.ఎస్.డబ్ల్యూ బి.రమేష్ మాట్లాడుతూ భారతదేశంలోని స్త్రీలందరూ  మహిళల దాస్యశృంఖలాలను తెగ నరికి, స్త్రీజాతికి హక్కులను దాఖాలా చేసి,  మనుస్మృతిని దహనం చేయడం ద్వారా  విముక్తి సిద్ధాంతాన్ని పీడిత కులాలకు ఇచ్చిన ఘనత అంబెడ్కర్ దే అని అన్నారు. బాబాసాహెబ్ మహా పరినిర్వాణ దినోత్సవ సందర్భంగా ఆది భారతీయులు మహోన్నతమైన మహా మనిషి ప్రధాన ఆశయమైన రాజ్యాధికారాన్ని సాధించడం ద్వారా మాత్రమే వారికి ఘనమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిబిఆర్ సి సిటీ కో ఆర్డినటర్ భలే సురేష్, హాస్టల్ వార్డెన్ జి.వెబ్కటేశ్వ రమ్మ , విద్యావేత్త సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author