కొల్లేరులో జరిగే అక్రమాలను కేంద్రం దృష్టికి తీసుకెల్లండి
1 min read– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారపాటి చౌదరికి వినతి పత్రం అందజేసిన కొల్లేరు గ్రామాల నాయకులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కొల్లేరు గ్రామాలలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమా లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కొల్లేరు గ్రామాలకు చెందిన నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి చౌదరిని శనివారం ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసి కొల్లేరు సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని మొర పెట్టుకున్నారు. అలాగే కొల్లేరు గ్రామాల సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయనను కోరారు.కొల్లేరు గ్రామాలు ఆధారపడి ఉన్న ఎన్నో సొసైటీ చెరువులసమస్యలను , కొల్లేరులో జరిగే అన్యాయ అక్రమాలు గురించి అలాగే ఈ అక్రమాలకు ఫారెస్ట్ అధికారులు అధికార పార్టీకికొమ్ము కాస్తున్నారని వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయనకు వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి కొల్లేటి సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఆయనను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ కొల్లేరు ప్రాంత నాయకులు సైదు గోవర్ధన్ , కొల్లేరు నాయకులు మోరు విజయరాజు , ఘంటసాల కుటుంబరావు, మోరు.విజయరా మరాజు ,సైదు నాగరాజు, జల్లురి రవి ప్రసాద్ , పంతగాని పెద్దిరాజు,మద్దా ప్రేమ కుమార్ ,వెల్పూరి వెంకటేశ్వరరావు, బలే ఏడుకొండలు ఇండేటి అగస్టిన్ ,పాతూరి పద్మస్ లు ఉన్నారు.