NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లు

1 min read

జనరల్ మేనేజర్ సి.వి. రామరాజు

ఏప్రత్యేక ఆఫర్లు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ ఏలూరు పరిధిలో వినియోగదారులకు పలు ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు అందిస్తున్నట్లు సంస్థ ఏలూరు జనరల్ మేనేజర్ సి.వి. రామరాజు తెలిపారు.ప్రత్యేక ఆఫర్లలో భాగంగా 248 రోజుల కాలపరిమితికి రూ.1,999తో వంద మెగాబైట్ల వేగంతో సేవలు, అపరిమిత కాల్స్, డేటా సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.2,399 విలువైన పథకానికి అదనంగా 47 రోజుల కాలపరిమితి కల్పించి మొత్తం 412 రోజుల సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లు సెప్టెంబర్ 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.రూ.499 పథకంపై ప్రత్యేక రాయితీతో పాటు కొత్త ఫైబర్ కనెక్షన్లకు ఏర్పాటు రుసుము లేకుండా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి మూడు నెలలు నెలకు రూ.100 చొప్పున తగ్గింపు కల్పిస్తున్నట్లు వివరించారు.కొత్తగా, ప్రస్తుతం ఫైబర్ సేవలు వినియోగిస్తున్న వారికి రూ.1,199తో ప్రత్యేక పథకాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రెండు వందల మెగాబైట్ల వేగం, నెలకు ఐదు వేల జీబీ వరకు డేటా, పదహారు ప్రముఖ వినోద వేదికల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పథకంపై మొదటి ఆరు నెలలు నెలకు రూ.88 తగ్గింపు ఉంటుందని తెలిపారు.మొబైల్ వినియోగదారులకు స్వీయ సేవా అనువర్తనం ద్వారా వినోద కార్యక్రమాలను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సమాచార మార్పిడికి ఉపగ్రహ ఆధారిత ఫోన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సి.వి. రామరాజు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

About Author