ఆలయానికి ఇబ్బంది లేకుండా విద్యుత్ టవర్లను నిర్మించండి
1 min read– ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: కొంతలపాడు గ్రామంలో ఇండస్ట్రియల్ విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేస్తున్న విద్యుత్ టవర్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మించాలని విద్యుత్ కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉప్పలపాడు గ్రామం నుండి ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ కు నిర్మిస్తున్న విద్యుత్ టవర్లు ఆలయానికి అడ్డుగా వస్తున్నాయని వాటిని ఆలయానికి దూరంగా నిర్మించాలని కొంతలపాడు గ్రామ సర్పంచ్ మధుకేశన్న,వైసీపీ నాయకులు మద్దయ్య, గ్రామ పెద్దలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. శనివారం దేవాలయానికి పక్కన నిర్మిస్తున్న విద్యుత్ టవర్లను పరిశీలించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాగంటి ఈశ్వర స్వామి ఆలయానికి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో దేవస్థానం అభివృద్ధి చెందెందుకు వీలుగా ఉంటుందని వాటికి అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లను దేవాలయానికి దూరంగా ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందించి గ్రామ ప్రజలకు దేవాలయానికి ఇబ్బంది లేకుండా విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి జడ్పిటిసి రంగనాథ్ గౌడ్ ఎంపీపీ తిప్పన్న, జగదీశ్వర్ గౌడ్ రాము గౌడ్, గ్రామ పెద్దలు ప్రజలు ఉన్నారు.