NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇళ్లు నిర్మించుకోండి.. సౌకర్యాలు కల్పిస్తాం

1 min read

– జాయింట్​ కలెక్టర్​ (హౌసింగ్​) ఎన్​. మౌర్య
పల్లెవెలుగు వెబ్​, డోన్​ : రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా గూడులేని ప్రతిఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సదుద్దేశంతో జగనన్న కాలనీలు తీసుకొచ్చిందని, పేదలు త్వరితగతిన ఇల్లు నిర్మించుకోవాలని జాయింట్​ కలెక్టర్​ (హౌసింగ్​) ఎన్​. మౌర్య సూచించారు. గురువారం డోన్​ మండలంలోని దొరపల్లె, ఉడుములపాడులో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రభుత్వం మోడల్ కాలనీ గా జగనన్న కాలనీలను రూపొందుతోందని లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు రోడ్లు , విద్యుత్ సదుపాయం, తాగునీటి వసతి, ఉపాధి కల్పన వంటి చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ నాగరాజు, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, ఏఈ RWS, ఏఈ ట్రాన్స్ కో, DE Panchayat Raj, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.


About Author