NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిల్డింగ్ కూల్చివేత‌.. టీడీపీ నేత ఆగ్రహం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావు భ‌వ‌నాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. విశాఖ‌లోని పాత‌గాజువాక ప్రాంతంలో ఉన్న ప‌ల్లా శ్రీనివాస‌రావు మ‌ల్టీప్లోర్ బిల్డింగ్ … అనుమ‌తి లేకుండా నిర్మించారంటూ అధికారులు కూల్చేశారు. విష‌యం తెలుసుకున్న పల్లా శ్రీనివాస‌రావు బిల్డింగ్ వ‌ద్దకు చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చామ‌ని అధికారులు చెబుతున్నారు. విష‌యం తెలుసుకున్న టీడీపీ కార్యక‌ర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడ భారీగా మోహ‌రించారు. టీడీపీ నేత ప‌ల్లా శ్రీనివాస‌రావును అక్కడి నుంచి పోలీసులు బ‌ల‌వంతంగా పంపించేశారు. జ‌గ‌న్ ప్రభుత్వం టీడీపీ నేత‌ల మీద క‌క్షసాధింపునకు దిగింద‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.

About Author