బల్క్ డ్రగ్స్ పరిశ్రమకు బొగ్గు కొరత.. సామాన్యుడికి భారం తప్పదా ?
1 min readపల్లెవెలుగువెబ : బల్క్ డ్రగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముడి పదార్థాలు లభించక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. తాజాగా బొగ్గు కొరత, పెరిగిన ధరలతో మరిన్ని కష్టాలు ఎదుర్కొంటోంది. విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి ఇతర పరిశ్రమలకు బొగ్గు సరఫరాను తగ్గించడంతో .. బల్క్‌డ్రగ్స్ పరిశ్రమ బొగ్గు కొరతను ఎదుర్కొంటోందని హైదరాబాద్‌కు చెందిన బల్క్‌డ్రగ్స్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఫార్ములేషన్ల తయారీ, ధరలపై కూడా ఉంటుందని అంటున్నారు. బొగ్గు సరఫరా కొరత కారణంగా కంపెనీలు ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటే కంపెనీల వ్యయాలు పెరుగుతాయి. ఈ ప్రభావం వినియోగదారుడికి అందే ధరలపై ఉంటుంది. వ్యయాలు పెరిగితే చివరకు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదని అంటున్నారు.