NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుల్లీ బాయ్ యాప్ కేసు.. నిందితురాలి అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బుల్లీ బాయ్ యాప్ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్త‌రాఖండ్ కు చెందిన 19 ఏళ్ల యువ‌తి శ్వేతా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి విశాల్‌ కుమార్‌ ఝా (21)ను సోమవారమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విశాల్‌ ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితురాలైన శ్వేతా సింగ్‌ను ఉత్తరాఖండ్‌లో అరెస్ట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే 100 మందికిపైగా ముస్లిం మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి బుల్లి బాయ్‌ అనే యాప్‌లో అప్‌లోడ్‌ చేసి వేలానికి ఉంచిన విషయం తెలిసిందే.

                                   

About Author