PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎట్ట‌కేల‌కు బుట్టా రేణుక‌కు వైసీపీలో ప్ర‌మోష‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టారేణుకకు వైఎస్సార్‌సీపీలో ప్రమోషన్ లభించింది. కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బుట్టా రేణుక ఆంధ్రప్రదేశ్‌లోని 2014 జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా టీడీపీ అభ్యర్థి బిటి. నాయుడుపై పోటీచేసి 4,72,782 ఓట్ల భారీ గెలుపొందారు. ఆ తరువాత కాలక్రమేణా 2017లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీల‌కంగా వ్యవహరించారు. అయితే మళ్లీ 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో వర్గ విభేదాలు రావడంతో మళ్లీ సొంతగూటికే చేరింది. ఏ పదవి ఆశించకుండా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాల్లో మొదట చురుగ్గా పనిచేసిన బుట్ట రేణుకకు… రోజులు గడుస్తున్నా ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో… మెల్లమెల్లగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అలకబూనారు. ఇది గమనించిన అధిష్టానం ఇప్పుడు బుట్టా రేణుకకు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా సీఎం జగన్ నియమించారు.

                                   

About Author