స్థానిక 16వ డివిజన్ అరుంధతి కాలనీలో మజ్జిగ పంపిణీ
1 min read
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జెపి)
కార్పొరేటర్ జుజ్జువరపు విజయనిర్మల రమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక 16 వ డివిజన్ అరుంధతి కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జుజ్జువరపు విజయనిర్మల,రమేష్ ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం వాహనదారులకు, బాటసారిలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడమైనది. మజ్జిగ పంపిణీ కార్యక్రమం ను ముఖ్యఅతిథి గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి) చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసిన జుజ్జువరపు విజయనిర్మలను జెపి, వైసిపి కార్యకర్తలు అభిమానులు ప్రశంసించారు.ఈ కార్యాక్రమానికి పార్టీ నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.


