కౌలుకార్డ్ ల పై రైతులకు అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలము లోని నాయకల్లు, కొంగనపాడు గ్రామంలో కౌలుకార్డ్ ల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇందులో భాగంగా వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు మాట్లాడుతూ కౌలు చేసుకునే ప్రతి రైతు కూడా రైతు భరోసా కేంద్రంలో వెళ్లి కౌలు ఒప్పంద పత్రం తీసుకొని వెళ్లి కౌలు పత్రాలు తీసుకోవాలని, అలాగే ఎలినినో ప్రభావితం పై అవగాహన, పంట మార్పిడి, భూసార పరీక్షలు, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల పై మొగ్గు చూపి భూసారాన్ని పెంచి అధిక లాభాలను పెంచుకోవాలని, పురుగు మందుల వాడకం తగ్గించి జీవామృతంతో పిచికారి చేసి పెట్టుబడులు తగ్గించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

