PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వి.హబ్ ద్వారా ఆర్య వైశ్యుల కు చేయుత…

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: వ్యాపార అభివృద్ధి కోసం వి.హబ్ స్థాపించామని వి.హబ్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు.వి.హబ్ లో విజయం సాధించిన వ్యాపారవేత్తలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని వ్యాపారాలను విస్తరించే విధంగా అనే కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు.ఆర్య వైస్యులకు చేయూత నిస్తూ “వి వైశ్య” విజయవాడ జోన్ ఆధ్వర్యంలో వి.హబ్ కార్యక్రమాన్ని శనివారం నోవోటెల్ లో ఏర్పాటుచేశారు.ఈ సందర్భంగా వి.హబ్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ “వి.వైస్య” అంటే వైశ్యుల వ్యాపార వేదిక అని, వైస్యుల వ్యాపారాలకు ఉన్నతమైన ఆలోచనలు జోడించి వి హబ్ ను 2018లో స్థాపించామని చెప్పారు. వి.హబ్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని, నాలుగు రాష్ట్రాలలో మరిన్ని ఫ్రాంచైజ్లు స్తాపించి అంచనాంచలుగా వ్యాపార అభివృద్ధిని విస్తరించుకున్నామని వెల్లడించారు.వి.హబ్ ద్వారా విజయం సాధించిన వ్యాపారవేత్తలు తమ వ్యాపార అభివృద్ధిని తోటి వారితో పంచుకోవచ్చని, మరింత అభివృద్ధి చెందొచ్చని తెలిపారు. కొత్తగా వచ్చే వారికి వ్యాపార మెలికలు నేర్పి విజయ పదంలో తీసుకు వెళ్ళటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వెల్లడించారు.విజయవాడ జోనల్ ప్రెసిడెంట్ హరీష్ మాట్లాడుతూ వి హబ్ వల్ల వైశ్యులకు వ్యాపార అభివృద్ధి చెందటమే కాకుండా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. మంచి వ్యాపారాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార అభివృద్ధిని విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సువర్ణ, అడ్వైజర్ మురళి, కన్వీనర్ లు దుర్గాప్రసాద్, మహేంద్ర లు పాల్గొన్నారు.

About Author