PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాతా వారి వివాహానికి హాజరైన బైరెడ్డి,గౌరు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు గ్రామానికి చెందిన మాజీ కేడిసీ సీ చైర్మన్ కాతా అంకిరెడ్డి మనవడు(కాతా రామ్మోహన్ రెడ్డి,కళ్యాణి)ల కుమారుడు కాతా అభిషేక్ రెడ్డి,రమా ధీరజ వివాహం రోళ్లపాడు లోని శ్రీ భరక సంజీవరాయ స్వామి దేవాలయంలో గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది.వివాహ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాండ్ర లింగారెడ్డి,మిడుతూరు జెడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,అగ్రసేని బికే సింగ్ తదితర రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, ఖాతా బ్రదర్స్ రామచంద్రారెడ్డి రాజశేఖరరెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసిరెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,వంగాల శివరామిరెడ్డి,సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి,మనోహర్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నుంచి రాజకీయాల కతీతంగా నాయకులు వివాహానికి హాజరయ్యారు.

About Author