కేబినెట్ మీటింగ్.. కొత్త పీఆర్సీకి ఆమోదం ?!
1 min read
Chief Minister Y S Jaganmohan Reddy addressing Andhra Pradesh cabinet meeting in Vijayawada on Friday. Pic:Style Photo service.
పల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కరోన అంశం గురించి చర్చించనున్నారు. ఉద్యోగుల కొత్త పీఆర్సీకి కేబినెట్ ఆమోదం తెలపనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కరోనతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఆమోదం తెలపనుంది.