NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చర్చలకు పిలుపు.. పీఆర్సీ రద్దు చేస్తేనే వస్తాం !

1 min read

పల్లెవెలుగువెబ్ : పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రి బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఫోన్ చేసి సంప్రదింపులకు రావాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమై రేపు సీఎస్ కు ఇవ్వనున్న సమ్మె నోటీసు, ఉద్యమ కార్యాచరణ సహా ఇతర అంశాల పై చర్చించారు. ఈ సమయంలోనే మంత్రుల నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ వచ్చింది. సమ్మో నోటీసు ఇవ్వొద్దని, సామరస్యపూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని బొత్స సత్యనారాయణ, పేర్నినాని కోరారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని మంత్రులకు తేల్చిచెప్పారు.

       

About Author