భూ కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలి
1 min read
భూకబ్జా నుండి మొలకలకుంటను కాపాడాలి
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ పట్టణమునకు ఆనుకుని ఉన్న మొలకలకుంటను భూ కబ్జాదారుల నుండి కాపాడాలని, భూకబ్జాదారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి తిక్క స్వామి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ రామకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో ఓబులేసుకు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇల్లు లేని, స్థలాలు లేని పేదల కోసం 203/3 సర్వేనెంబర్ గల భూమిలో ఇంటి స్థలాల కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థలాలు పట్టుకోవడం జరిగిందనీ తెలిపారు ఇంటి పట్టాల కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టేమన్నారు కుంట పోరంబోకు సంబంధించిన భూమి కావడంతో నీటి ప్రభావం ఉంటుందని పట్టాలు మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేశారన్నారు , అప్పటి నుండి ఇప్పటివరకు ఆ స్థలం ఖాళీగా ఉండటంతో కన్నేసిన కబ్జాదారుడు రెవెన్యూ అధికారులు అండదండలతో ఫేక్ పాస్ పుస్తకాలు పుట్టించుకొని భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు ,భూ కబ్జాదారున్నీ దళితులు అడ్డగించడంతో అక్కడి నుండి ఉడయించినట్లు తెలిపారు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఏమిటని వారు ప్రశ్నించారు భూకబ్జాదారునీకి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాముడు, నరసింహులు, ఠాగూర్, అడ్వకేట్ రవి, ఉచ్చురప్ప జయసింహ, రామాంజనేయులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

