మే 16న వివాహం చేసుకోదలచిన వారికి నగదు పారితోషకం
1 min read
-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: తన జన్మదినాన్ని పురస్కరించుకొని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషకం అందుకునే వారి కొరకు అప్లికేషన్లను అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్య ఇన్ నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా గత 30 సంవత్సరాలుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. వివాహం చేసుకునే వధూవరులలో ఒకరు కర్నూల్ నియోజకవర్గ పరిధిలోకానీ లేక పంచలింగాల, ఈ- తాండ్రపాడు, గొందిపర్ల, పూలతోట, దేవమాడ, దొడ్డిపాడు గ్రామాలకు చెందిన వారై ఉండాలన్నారు. అన్ని కులాల వారు మరియు ముస్లిం, క్రైస్తవులు కూడా వివాహాలు చేసుకుని వారితోషకం పొందడానికి అర్హులేనని ఆయన తెలిపారు. పారితోషకానికి దరఖాస్తు చేసుకునేవారు తమకు ఎటువంటి దురఅలవాట్లు లేవని, భవిష్యత్తులో చెడు అలవాట్లకు బానిసలు కామని డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుందని టీజీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వధూవరులు ఇరువురు మేజర్లై ఉండాలని వారికి నగదు పారితోషికంతో పాటు, తాళిబొట్టు, కాలిమెట్టలు, పట్టు వస్త్రాలు అందజేస్తామని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాశెట్టి శ్రీనివాసులు, వాయుగండ్ల సుబ్బారావు, కె రామస్వామి, శ్రీకాంత్, బాలయ్య, పాల్ రాజ్, హర్షవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.