NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వారపు సంత మార్కెట్ లో  సీసీ రోడ్డు పనులు ప్రారంభం…

1 min read

న్యూస్ నేడు హొళగుంద : హోళగుంద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుల సహకారంతో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి నోచుకోక సమస్యాత్మకంగా ఉన్న వారపు సంత మార్కెట్ నందు సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరిగింది.ముందుగా సర్పంచ్ చలువాది రంగమ్మ పూజ చేసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ వర్ష వస్తే బురద మయంగా మారుతున్న వారపు సంత మార్కెట్ నందు వ్యాపారస్తుల,కొనుగోలు దారుల ఇబ్బందులను దృష్టిలను ఉంచుకుని షరా వేగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. అనంతరం మార్కెట్ వ్యాపారస్థులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి జరగకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ సమస్యలను గుర్తించి మార్కెట్ నందు సీసీ రోడ్డు,నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి మార్కెట్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ చలువాది రంగమ్మకు మరియు కార్యదర్శి రాజశేఖర్ కు,వార్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే మార్కెట్ నందు సీసీ రోడ్డు వేయడంతో వ్యాపారస్థులు,కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేశారు.

About Author