NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిస్ట్రిబ్యూటీ వద్ద మరమ్మతులు…

1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్, ఎల్ ఎల్ సి డి సి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ ఆధ్వర్యంలో ఎల్ ఎల్ సి టి సి ప్రెసిడెంట్ ఉస్మాన్  హోళగుంద మండల పరిధిలోని 53 వ డిస్ట్రిబ్యూటరీ వద్ద పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అబ్దుల్ సుబాన్, డిస్ట్రిబ్యూటరీ మెంబర్ ముల్లా అలీ, సి బి ఎన్ ఆర్మీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్,రైతులు అబ్దుల్ బారి,ఇజాజ్, వారిస్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు అబ్దుల్ సుభాన్, మోయిన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి  కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డిస్ట్రిబ్యూటీ వద్ద మరమ్మతులు చేయడం ద్వారా రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నారు. డిస్ట్రిబ్యూటరీ వద్ద రోడ్డుకు గ్రావెల్ తరలించి చదును చేయడం ద్వారా రైతులు తమ పంట పొలాలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు.

About Author