PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువగళం మహా పాదయాత్రను జయప్రదం చేయండి

1 min read

– ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ (చంటి)

– యువగళం పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు తెలుగుదేశం పార్టీ బడేటి క్యాంప్ కార్యాలయం నందు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆశీస్సులతో ఎస్సి సెల్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను సమీకరించి ఒక రోజు ముందుగా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు జరుపుకొని అనంతరం యువగళం పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలను తెలుసుకొని మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం అనే ప్రతిష్టాత్మకమైనటువంటి మహా పాదయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాళ్ల సుజీరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి రోడ్ షోలకు ఉభయ రాష్ట్రాలలో కూడా జన ప్రభంజనాన్ని చూసినటువంటి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తట్టుకోలేక ఈ మహా పాదయాత్రను అడ్డుకోవాలని కుయుక్తులు పన్నటం సరిగాదని గతంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా పోలీసువారి చేత సెక్యూరిటీని ఏర్పాటు చేశారని ప్రస్తుత ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోవాలని మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, అరాచక పాలనపై లోకేష్ పాదయాత్ర భారతదేశంలోని భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉంటుంది. రానున్న రోజులలో యువతకు ఉద్యోగ భద్రత కల్పించడంలో పార్టీ ముందుంటుందని. శ్రీ నారాలోకేష్ పాదయాత్రకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకట రత్నం, ఏలూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ , దెందులూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు రఘురామ్, ఏలూరు మాజీ మార్కెట్ చైర్మన్ నిరంజన్, నాయకులు టోకూరు యెబూ, లక్కపాము నాని, మల్లెపు రాము, తిప్పాని రాజేష్,దాసరి శ్రీనివాస్, రమేష్, ఏలూరు నియోజకవర్గ, దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author