సిమెంట్ మంట.. భగభగమంటున్న ధరలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : సిమెంట్ ఉత్పత్తి , వ్యయా లు పెరగడంతో కంపెనీలు గత నాలుగు వారాల్లో బస్తా సిమెంట్ ధర రూ.80 నుంచి రూ.100 వరకు పెంచేశాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పేరొందిన కంపెనీల సిమెంట్ బస్తా రిటైల్ మార్కెట్లో రూ.450 వరకు పలుకుతోంది. ఇంధన వ్యయాలు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. డీజిల్ ధరల పెంపు ప్రారంభమైతే రవాణా ఖర్చులు పెరిగి ధరలు మరిం త పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఇదే పరిస్థితి.