తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు !
1 min read
Cement bags. Paper sacks isolated on white background.
పల్లెవెలుగువెబ్ : ఏపీ, తెలంగాణల్లో సిమెంటు ధరలు పెరగనున్నాయి. 50 కిలోల బస్తా పై రూ. 20-30 వరకు పెంచుతున్నట్టు సిమెంట్ కంపెనీలు తెలిపాయని డీలర్లు తెలిపారు. గత 2 నెలలుగా సిమెంటు ధరల్లో ఒడుదొడుకులు నెలకొన్నాయి. అంతకుముందే ధర బాగా పెంచిన సిమెంటు కంపెనీలు, డిమాండ్ తగ్గడంతో డిసెంబరు తొలివారంలో 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు ధర తగ్గించాయి. డిసెంబరు మధ్య నుంచి మళ్లీ సిమెంటు విక్రయాలు పెరుగుతుండటం, ప్రైవేటు ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ మౌలిక సదుపాయాల విభాగం నుంచి గిరాకీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో తాజాగా కంపెనీలు ధర పెంచాయని డీలర్లు వెల్లడించారు. ధరల పెంపు తర్వాత రెండు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర బ్రాండ్, ప్రాంతం ఆధారంగా రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు.