రాఘవేంద్ర స్వామి ని దర్శించుకున్న రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనన్ ఛైర్మెన్
1 min read
చిత్త విజయ ప్రతాప్ రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనన్ ఛైర్మెన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి వచ్చారు. వీరికి తహసీల్దార్ రవి, యం ఈఓ రాఘన్న, సిఎస్ డిటి మహేష్, మఠం అధికారులు స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట అధికారులు ఉన్నారు.