PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏప్రిల్ 5 న ఛలో ఢిల్లీ..

1 min read

– లక్షలాది మందితో కార్మిక, కర్షక ఐక్యతా ర్యాలీ..
– కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మతోన్మాద కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ భవిష్యత్తుకు ప్రమాదంఉందని.సిఐటియు, వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాల జిల్లా సదస్సులో వక్తలు ఆందోళన చేస్తున్నారనిఏలూరుకార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం, కేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న ఛలో ఢిల్లీ.లక్షలాది మందితో జరుగుతున్న కార్మిక,కర్షక ఐక్యతా ర్యాలీ ని విజయవంతం చేయాలని సిఐటియు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం* జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సు పిలుపునిచ్చింది.స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏప్రిల్ 5 చలో ఢిల్లీ విజయవంతం కోరుతూ జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సుకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎన్.వి.డి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, కౌలు రైతుల సంఘం జిల్లా కోకన్వీనర్ వి. శ్రీరామచంద్రమూర్తి, సిఐటియు జిల్లా నాయకురాలు కె. విజయలక్ష్మి, భూ పోరాట నాయకురాలు సిహెచ్ మణి మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంపదనంతా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు దోచుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలపై ఎక్కువ పన్నులు మోపడంతో మధ్యతరగతి, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చేశారు. నవరత్నాలుగా పేరొందిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు. లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్నారని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు రక్షణగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కౌలు రైతులకు రక్షణ లేదన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని,రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందన్నారు.కేంద్రం విధానాలతో రాజ్యాంగం పెను ప్రమాదంలో పడిందని. దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు.ఈ ప్రజావ్యతిరేక, మతోన్మాద, నియంతృత్వ భాజపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పకుంటే ఈ దేశ సంపద అంతా అదానీ, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు.ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక ఐక్యతతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రైతులకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కూలి రోజుకు రూ.600 ఇవ్వాలని, కౌలు రైతులకు సమగ్ర చట్టం తేవాలని కోరుతూ ఈ సదస్సులో తీర్మానం ఆమోదించారు. చలో ఢిల్లీ విజయవంతం కోరుతూ దశలవారీగా ఇంటింటా ప్రచారం, జాతాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది.ఈ సదస్సులో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బి. సోమయ్య,పి.కిషోర్,ఎం. నాగమణి, టి. సత్యనారాయణ, ఆర్ వి ఎస్ నారాయణ, అనుమోలు మురళీ, గుండపనేని సురేష్,బి.జగన్నాధం,వి.సాయిబాబా,జి.గోపి, శేషపు మహంకాళిరావు తదితరులు పాల్గొన్నారు.

About Author