PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో రాయచోటి వాస్తవ్యులు కోప్పల ప్రేమ చంద్ర రెడ్డి వర్ధంతి సందర్భంగా బండపల్లె ప్రేమాలయం వృద్ధాశ్రమంలో గురువారం అన్నదానం ఏర్పాటు చేశారు. కీ.శే?చంద్ర రెడ్డి సతీమణి కోప్పల భాగ్యమ్మ సౌజన్యంతో కార్యక్రమం లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా చాన్​బాష మాట్లాడుతూ జన్మదినం.. వర్ధంతి రోజులు అనాధశ్రమంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడం గొప్ప పుణ్య కార్యమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దవాళ్లకు గౌరవించడం బాల్యం నుంచి నేర్పిస్తే ఇలా అనాధ ఆశ్రమాలు భవిష్యత్ లో ఉండవన్నారు. కార్యక్రమంలో లయన్ మహమ్మద్, జనార్దన్ రెడ్డి,ఆశ్రమము సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

About Author