PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం మైనార్టీలకు అండగా ముఖ్యమంత్రి

1 min read

– రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని..
– ఏలూరు శనివారపుపేట లో హాజరత్ సయ్యద్ జమాల్ షా బాబా మహాత్ముల వారి ఉరుసు కార్యక్రమం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు శనివారపు పేటలో జరిగిన హాజరత్ సయ్యద్ జమాల్ షా బాబా మహాత్ముల వారి ఉరుసు కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని శనివారం పాల్గొన్నారు.ఈసందర్భంగా దర్గా నిర్వాహకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నానికి పుష్పగుచ్ఛం అందించి ముస్లిం సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరుతు ఆళ్ల నాని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని,ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఆశీర్వదిస్తూ, ముస్లిం మైనారిటీలకు అండగా నిలుస్తున్న జగనన్న ప్రభుత్వము మరోసారి రావాలని కోరుతూ దర్గా ముజావార్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ “రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు చెందిన ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అండగా నిలుస్తున్నారని, ఇచ్చిన హామీల్లో భాగంగా ఇటీవల ప్రవేశ పెట్టిన షాదీ తోఫా పధకం ద్వారా పేద ముస్లిం కుటుంబాలకు వారి బిడ్డల పెళ్లికి అండగా నిలిచారని అన్నారు.రాష్ట్రంలోని అనేక నామినేటెడ్ పదవుల్లో సైతం జగనన్న ముస్లిం మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యం కల్పించారని అన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఏలూరులోని పలు మసీదులు, దర్గాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున అండగా నిలిచామని ఆళ్ల నాని తెలిపారు..సుమారు 4దశాబ్దాల పైగా శనివారపు పేటలోని హాజరత్ సయ్యద్ జమాల్ షా బాబా మహాత్ముల వారి దర్గాలో ఉరుసు కార్యక్రమం నిర్వహించటం పట్ల, దర్గా పోషకాలు అహ్మదుల్లా ఖాన్ కుమారులను ఆళ్ల నాని ప్రత్యేకంగా అభినందించారు.అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు నగర డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు MRD బలరాం, కో-ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, మున్నుల జాన్ గురునాధ్, కార్పొరేటర్ గునిపూడి శ్రీనివాస్, ఇమ్మానియేల్ జయకర్, వైఎస్సార్ సిపి నాయకులు కిలాడి దుర్గారావు, నిడికొండ నరేంద్ర, ఎల్లపు మోజెస్, హాజరత్ సయ్యద్ బాయజీద్ దర్గా ముజావార్లు షేక్ షాబీర్ హుస్సేన్, షేక్ షబ్బీర్ హుస్సేన్, పోలీస్ లైన్ మస్జీద్ కమిటీ అధ్యక్షులు రసూల్ , పెన్షన్ మహాల్లా మస్జీద్ కమిటీ అధ్యక్షులు నజీర్, సెక్రటరీ అక్రం, అహ్మదుల్లా ఖాన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

About Author