ప్రజలు భక్తి భావంతో.. మెలగాలి: చిన్నజీయర్ స్వామి
1 min readతిప్పాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంకు భూమి పూజ
పల్లెవెలుగు వెబ్: ప్రజలు భక్తిభావంతో.. ఆధ్యాత్మికంతో మెలగాలని కోరారు చిన్న జీయర్ స్వామి. గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోని తిప్పాయపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణంకు ఆయన భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణ కర్త రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి భావంతో ఆధ్యాత్మికంతో మెలగాలని మెలగాలని కోరారు. మనుషులందరూ ఒకటే. కులాలు మతాలు లేకుండా ప్రతి గ్రామంలో అందరూ సమానంగా ఉండాలని ప్రజలకి సూచించారు. ఈ గ్రామంలో ఈ ఆలయ నిర్మాణం తలపెట్టిన రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. గ్రామాలలో పచ్చని పాడి పంటలతో కలకలాడాలి.. ప్రకృతి సహకరించాలంటే దైవభక్తి మంచి మనసు కలిస్తేనే గ్రామాలు ప్రజలు సుఖశాంతులతో ఉంటారు భక్తి అంటే ముక్తి కాదు ప్రతి ఒక్కరూ దైవానికి దాసుడై దైవానుగ్రహం కోసం ఆ పరమాత్ముడికి ప్రణమిల్లాలి గ్రామంలో మంచి కార్యము కోసం పెద్ద మనసుతో స్వామి వారి ఆలయ నిర్మాణానికి అడుగులు పడేలా చేసిన రామ్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు శిలాన్యాస ప్రారంభోత్సవానికి రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఐఏఎస్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.