డీఈవో ను కలిసిన చిప్పగిరి లక్ష్మీనారాయణ..
1 min read
ఆలూరు, న్యూస్ నేడు: చిప్పగిరి మండల కేంద్రంలో కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు. ఆలూరు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోరత, కోన్ని పాఠశాలాలకు కనీసం కాంపౌండ్ వాల్స్ లేవని వారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆలూరు కేంద్రంలో కస్తూర్బా పాఠశాలకు కాంపౌండ్ నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అనంతరం ఎస్సీ కాలనీలోని సియోను ప్రార్థన మందిరం (చర్చి) ను సందర్శించారు.కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల ఉపాధ్యక్షులు కరెంటు గోవిందు, చిప్పగిరి సర్పంచ్ దాసరి గోవిందురాజులు, వినోద్ కుమార్, సాంబయ్య, స్వామిదాస్, బాలరాజు మరియు సంఘ పెద్దలు ఉన్నారు.