చిరస్మరణీయుడు వడ్డే ఓబన్న..
1 min read– తరిగోపుల లో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: స్వాతంత్ర్య సమరయోధులు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం రేనాటి గడ్డ తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షుడు బీసీల ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న 216 జయంతి సందర్భంగా తరిగోపుల గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డె ఓబన్న చిరస్మణీయుడని అన్నారు. బ్రిటీష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యోధుడు వడ్డె ఓబన్న అని కొనియాడారు.స్వతంత్ర పోరాటంలో రేనాటి ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అంగరక్షకుడుగా, సైన్యాధ్యక్షుడుగా ఓబన్న వీరోచిత పోరాటం చేశాడని, ఆయన సేవలు ఎనలేనివని అన్నారు.వడ్డె ఓబన్న పోరాట స్ఫూర్తితో వడ్డెర్లు ఐక్యమత్యంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తరిగోపుల నాగేశ్వరావు , నందికొట్కూరు బిజెపి పట్టణ అధ్యక్షుడు గూడూరు రవికుమార్ రెడ్డి ,బిజెపి బంగ్లా మండల అధ్యక్షుడు రమణ యాదవ్, వడ్డే రాజుల అన్నదాన సత్రం నంద్యాల అధ్యక్షులు వెంకటేశ్వరరావు , వడ్డెర కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎంవీ రమణ, తరిగొప్పుల గ్రామ నాయకులు నారాయణరెడ్డి , గిరీశ్వర్ రెడ్డి వడ్డే వెంకటేశ్వర్లు, మద్దిలేటి, సుంకన్న, బీసన్న, తదితరులు పాల్గొన్నారు.