క్రిస్టియన్ న్యాయవాదుల సెమీ క్రిస్మస్ వేడుకలు
1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేర
న్యాయవాదులు న్యాయం కోసం, ధర్మం కోసం,సమాజం కోసం పాటుపడాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా కోర్టు ఆవరణంలో ఏలూరు బార్ అసోసియేషన్ క్రిస్టియన్ న్యాయవాదుల కమిటీ ఆధ్వర్యంలో క్రిస్టమస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగిందని సభాధ్యక్షులు పెరికె వరప్రసాదరావు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మోస్ట్ రెవరెండ్ శ్రీశ్రీశ్రీ బిషప్ జయరావు పొలిమేర ప్రసంగిస్తూ క్రిస్టమస్ అంటే శాంతి సమాధానం అందరూ సంతోషంగా ఉండాలని. న్యాయవాదులు న్యాయం కోసం ధర్మం కోసం సమాజం కోసం పాటుపడాలని బిషప్ పిలుపునిచ్చారు. క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ న్యాయవాది రోనాల్డ్ రాజు మొట్టమొదటిసారిగా ఏలూరు బార్ లో క్రిస్టమస్ జరగటం ఆనందంగా ఉందని సంతోషంగా ఉందని ఇది ఒక శుభ పరిమాణంగా భావిస్తున్నామని తెలిపారు. రోనాల్డ్ రాజు సతీమణి జి.సునీత క్రీస్తు వర్తమానాన్ని విచ్చేసిన దైవజనులకు అందించారు. ఏలూరు కేతడ్రల్ ఆర్.సి.యం చర్చ్ ఫాదర్ మైఖేల్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ బి.వి కృష్ణ రెడ్డి, పీపీ వి.నారాయణ, మహిళా కోర్టు ఏపీపీ కేదార్,ఏజీపీ జిల్లా శ్రీనివాసరావు, ఏజీపీ కలపాల రవి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం,వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు,మాజీ ప్రెసిడెంట్ అభినేని విజయ్, ఏలూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సిఏపి ఆచార్యులు,సీనియర్ న్యాయవాది జి.పి డేనియల్, మద్దాల గోపాల్,సీనియర్ న్యాయవాది రెడ్ క్రాస్ ఏలూరు సెక్రటరీ, క్రిస్టమస్ గ్రీటింగ్స్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో లిటిల్ ల్యాంప్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ పోతురాజు మేరీ తనూజ పిల్లలచే కోలాటం మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అనంతరం పెరికె ఫౌండేషన్ చైర్మన్ పెరికె వరప్రసాదరావు ఏలూరు బార్ అసోసియేషన్ లో పనిచేసే స్టాప్ కు వస్త్రాలు పంపిణీ చేయడమైనది. అనంతరం బిషప్ జయ రావు క్యాండిలైట్ సర్వీస్ మరియు కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్.నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త చట్టాల మీద వచ్చిన బుక్స్ ను బిషప్ న్యాయవాదులకు పంపిణీ చేశారు.క్రిస్మస్ డిన్నర్ ని బి.వి. కృష్ణారెడ్డి హోస్ట్ చేశారు. అనంతరం బిషప్ జయరావు ని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వందలాదిమంది న్యాయవాదులు పాల్గొని క్రిస్టమస్ వేడుకలను జయప్రదం చేశారని పెరికె వరప్రసాదరావు తెలిపారు.


