మండల మైనార్టీ అధ్యక్షుడు మోయిన్ కు ఘన సన్మానం
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల టిడిపి మైనార్టీ అధ్యక్షుడు మోయిన్ ను టీడీపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు బుధవారం స్థానిక రైస్ మిల్లు నందు ఘనంగా సన్మానించారు.టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ గౌడ్,కో కన్వీనర్ జాకీర్,జనసేన కన్వీనర్ అశోక్,బుడగ జంగాల రామాంజీని, చిన్నహ్యాట సర్పంచ్ హేసన్ తదితరులు మోయిన్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా టిడిపి కన్వీనర్ తిప్పయ్య మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్పిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ,పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మోయిన్ కు మండల స్థాయిలో పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం నిష్కల్మషంగా నిస్వార్ధంగా పనిచేసే ఒక యువ నాయకుడికి పదవి ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను గుర్తించి వారికి తగిన హోదాలలో పదవులు ఇస్తూ, రాజకీయంగా యువకులను ప్రోత్సహిస్తున్న ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి మండల మైనార్టీ అధ్యక్షునిగా ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి, తనపై ఇంత ఆధార అభిమానాలను చూపుతూ రాజకీయంగా నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క టిడిపి నాయకులకు,కార్యకర్తలకు రుణపడి ఉంటానని తెలియజేశారు. అదేవిధంగా మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి.అబ్దుల్ రెహ్మాన్ ను మండల టిడిపి నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దిడ్డి నాగప్ప,హుస్సేన్ పీరా,సూరన్న, పీరన్న, ముల్లా వలి,బూత్ కన్వీనర్లు తాహెర్, వలి బాషా, అల్తాఫ్,ఇబాదుల్ల,లతీఫ్, టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


