NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచవ్యాప్తంగా  క్రిస్మస్ వేడుకలు  ఘనంగా జరుపుకోవాలి

1 min read

క్రీస్తు అందించిన ప్రేమ, కరుణ, సేవా గుణాలను ప్రతి కుటుంబంలో అలవర్చుకోవాలి

జనసేన పార్టీ జిల్లా కన్వీనర్, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ క్యాలెండర్ ను శుక్రవారం ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం రెడ్డి అప్పలనాయుడు ఆవిష్కరించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఏసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుంచి 2024లో ప్రజలందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. మంచి మనసుతో పాలకులందరూ పరిపాలించాలని, మంచి సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. క్రీస్తు అందించిన సందేశం ప్రేమ, కరుణ, సేవ, సహాయం ప్రతి ఒక్క కుటుంబంలో అలవర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

About Author