NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందరి సహకారంతోనే ఓటర్ జాబితా ప్రక్షాళన…

1 min read

– పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ కోసం ప్రతిపాదనలు

– ఆదోని నియోజకవర్గ ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు.

పల్లెవెలుగు వెబ్​ ఆదోని: లోపాలు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని రాజకయపార్టీలు సహకరించాలని ఆదోని నియోజకవర్గ అధికారి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఓటరు జాబిత పై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాను ప్రక్షాళన రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలన్నారు. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గం లో 256 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటిలో  24 పోలింగ్ స్టేషన్లకు సదుపాయాలు సరిగా లేనందువలన కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు.. 24 పోలింగ్ స్టేషన్లకు లొకేషన్ మార్పుకు, ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల మార్పుకు సంబంధించి ఏవైనా  సూచనలు ఉంటే   తెలియ చేయవచ్చని, వాటిని ఈఆర్వోలు పరిశీలించి తగిన  నివేదికలు  ఇస్తారని సబ్ కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.. పోలింగ్ స్టేషన్లు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్ స్టేషన్ లలో ర్యాంప్, టాయ్లెట్ విత్ రన్నింగ్ వాటర్, కరెంట్  ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబంసభ్యులందరూ ఒకే పోలింగ్‌ స్టేషన్ లో  ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని సబ్ కలెక్టర్ వివరించారు.అనంతరం మునిసిపల్ కౌన్సిల్ హల్ నందు ఎలక్షన్ సూపర్వైజర్స్ మరియు బిఎల్ఓలకు  స్పెషల్ సమ్మర్ రివిజన్ 24 బాగంగా పొలింగ్ స్టేషన్ హేతుబద్ధీకరణ లో భాగంగా ఒక కుటుంబం ఒకే పోలింగ్ స్టేషన్ కు ఓటు  ఉండే  విధంగా చర్యలు తీసుకోవాలని సూపర్వైజర్లకు, బి ఎల్ వో లకు  సమీక్ష సమావేశంలో సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాసిల్దార్ వెంకటలక్ష్మి, డిప్యూటీ తాసిల్దారులు రజనీకాంత్ రెడ్డి, ఎజాజ్ అహ్మద్, మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ,  తదితరులు పాల్గొన్నారు.

About Author