అలాంటి ఆస్పత్రులు మూసేయండి.. సుప్రీం కోర్టు ఆగ్రహం !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలోని ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోన సంక్షోభంలో సేవ చేయాల్సింది పోయి.. పక్కా రియల్ ఎస్టేట్ సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. నివాస ప్రాంతాల్లో రెండు, మూడు పడక గదుల్లో నర్సింగ్ హోమ్ లు కొనసాగుతున్నాయని, కనీస భద్రత ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రోగుల జీవితాలతో ప్రైవేటు ఆస్పత్రులు ఆడుకుంటున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి ఆస్పత్రులను మూసివేయాలని ఆదేశించింది. భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పాటించని ఆస్పత్రులకు వచ్చే ఏడాది జులై వరకు గడువు పొడిగిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.