సూర్యగ్రహణంతో ఆలయాల మూసివేత
1 min read
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: సూర్యగ్రహణంతో మండలంలోని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. మండల కేంద్రంలో ని శ్రీ భాస్కరనందీశ్వర స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ( అమ్మవారి శాల ) శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం శ్రీ రామాలయం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వెలగలపల్లె గ్రామం పొలిమేరలో వెలిసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో వెలసిన పలు ఆలయాలను మూసివేశారు. సూర్యగ్రహణం రావడంతో ఆలయాలలో భక్తులు ప్రవేశం చేయకుండా ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకులు ఆలయాల ప్రధాన ముఖ ద్వారాలు మూసివేశారు. మంగళవారం రోజున పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల ప్రధాన ద్వారాలు ఉదయం 10:00గంటల నుండి మూసి వేశామని తిరిగి మరల బుధవారం రోజున సంప్రోక్షణ పూజల అనంతరం ఆలయాల తలుపులు తెరవడం జరుగుతుందని తద్వారా భక్తుల ప్రవేశం ఉంటుందని ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకులు తెలిపారు.
