ఢిల్లీకి సీఎం.. మోదీతో భేటీ
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మూడు రాజధానుల అంశం, అమరావతి అభివృద్ధి కార్యాచరణ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టే అంశం పై ఆయన మోదీతో చర్చించనున్నారు. విభజన హామీలు అమలు చేయమని కోరనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో పలు సమస్యలపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందివ్వనున్నారు. సీఎం జగన్ ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.