PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం పర్యటన ఏర్పాట్లు.. భేష్​

1 min read
ఎయిర్​పోర్ట్​ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్​, ఎమ్మెల్యే,జేసీలు

ఎయిర్​పోర్ట్​ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి, కలెక్టర్​, ఎమ్మెల్యే,జేసీలు

నేడు ఓర్వకల్లు ఎయిర్​ పోర్ట్​ ప్రారంభోత్సవం
– రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్​ పోర్ట్ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి విచ్చేస్తున్న నేపథ్యంలో.. జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి అన్నారు. బుధవారం ఎయిర్​ పోర్ట్​ వద్ద మంత్రితోపాటు జిల్లా కలెక్టర్​ జి. వీరపాండియన్​, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, కర్నూల్ నగరపాలక సంస్థ బి.వై రామయ్య బుధవారం విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను సీఎం సెక్యురిటితో కలిసి పరిశీలించారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ బయట వైపు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ రిబ్బన్ కట్, జ్యోతి ప్రజ్వలన చేసే ప్రదేశాలను పరిశీలించారు. అలాగే కర్నూల్ ఎయిర్పోర్ట్ పోస్టల్ స్పెషల్ కవర్స్ ఆవిష్కరణ , ఎయిర్ పోర్టు ఆవిష్కరణ శిలాఫలకం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ బయటి వైపు ఉన్న జాతీయ పతాకం పాయింట్ ను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, అడిషనల్ ఎస్పీ గౌతమి శాలిని, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డ్వామా పిడి అమర్నాథరెడ్డి, సమాచార శాఖ ఉపసంచాలకులు పి.తిమ్మప్ప, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మల్లికార్జున్, తిప్పే నాయక్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author