సీఎం బర్త్ డే… మంత్రి రక్తదానం..
1 min read
సీఎం చంద్రబాబును చూసి ఎంతో నేర్చుకోవాలి
- రాష్ట్ర మంత్రి టి.జి భరత్
కర్నూలు:ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. సీఎం చంద్రబాబు 75వ జన్మదినం పురస్కరించుకుని కర్నూల్లోని అక్షయ బ్లడ్ బ్యాంకులో మంత్రి టి.జి భరత్ రక్తదానం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ఆయన ఆలోచన విధానం ఎంతో గొప్పదన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం సీఎం చంద్రబాబు బ్రాండ్ తోనే రాష్ట్రానికి వచ్చాయని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, రాష్ట్ర నాయకులు ఆకెపోగు ప్రభాకర్, సోమిశెట్టి నవీన్, కార్పొరేటర్లు కురువ పరమేష్, కైప పద్మలతా రెడ్డి, సీనియర్ నాయకులు రామాంజనేయులు, గున్నామార్క్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
