కాగ్నిజెంట్.. 50 వేల కొత్త నియామకాలే లక్ష్యం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ ఏడాది భారత కార్యకలాపాల కోసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55,000 మందిని ఉద్యోగంలో చేర్చుకోనున్నట్లు త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ రాజేశ్ నంబియార్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన మొదటి త్రైమాసికంలో కంపెనీ 9,800 మందిని నియమించుకుంది. తద్వారా కంపెనీ మొత్తం ఉద్యోగులు 3.40 లక్షలకు చేరుకున్నారు. ఫ్రెషర్లతో పాటు అవసరాన్ని బట్టి అనుభవజ్ఞుల నియామకాలనూ చేపట్టనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్‌తో పాటు ఉద్యోగుల వలసలు కూడా ఊపందుకోవడంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రాంగణ నియామకాల జోరును పెంచాయి.