కలెక్టర్ డా.ఏ.సిరి కి శుభాకాంక్షలు
1 min read
డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, హార్ట్ ఫౌండేషన్ కమిటీ సెక్రటరి డా. చంద్ర శేఖర్
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు : కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి ని కలెక్టరేట్ లోని ఆమె ఛాంబరులో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి, డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్, వైస్ ప్రెసిడెంట్ డా. భవాని ప్రసాద్, జనరల్ సెక్రటరి డా.ఏ. వసంత కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ను 2002 సంవత్సరంలో స్థాపించామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని , అందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించారని తెలిపారు. హార్ట్ ఫౌండేషన్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ కలెక్టర్ ఏ.సిరి కి విన్నవించారు. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే ఉన్నందున 25వ తేదీ గురువారం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఛాంబరులో వరల్డ్ హార్ట్ డే పోస్టర్ ను విడుదల చేస్తున్నామని, ఇందుకు విశిష్ట అతిథిగా, చైర్మన్ గా విచ్చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి ని ఫౌండేషన్ సభ్యులు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఏ. సిరి… సేవా కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు.

