విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకి కారుణ్య నియామక పత్రాలు
1 min read
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఉద్యోగ నిర్వహణలో ఆసువు లు బాసిన సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అంద చేసిన జిల్లా ఎస్పీ 6వ బెటాలియన్, ఏపీఎస్పీ, మంగళగిరి లో సేవలందించి విధి నిర్వహణలో అమరుడైన పీసీ 890 కోట్నాని తారక రామారావు సతీమణి రాంబా జయశ్రీ కి, కొడమంచిలి ఆదిలక్ష్మి భర్త మధు కుమార్ ఏఆర్పిసి 47 రాజమండ్రి అనువారూ లకు కారుణ్య నియామకం ఉద్యోగ నియామక ఉత్తర్వులను జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,పోలీసు విభాగంలో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలను ప్రోత్సహించడం మరియు ఆదుకోవడం మా ప్రధాన బాధ్యత. అటువంటి కుటుంబాలకు తోడుగా నిలబడేందుకు ప్రభుత్వం చేపట్టిన కారుణ్య నియామక విధానానికి అనుగుణంగా ఈ నియామకం చేపట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాల అధికారులు, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
