ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోటీలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై సబ్ జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో చిత్రలేఖన,వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 4 నుంచి 9 సంవత్సరాలలోపు వారిని సబ్ జూనియర్స్ గా ను,పది నుంచి 14 సంవత్సరాల లోపు వారిని జూనియర్స్ గాను, 15 సంవత్సరాలు పైబడిన వారిని సీనియర్స్ గాను పరిగణిస్తారని ప్రతి విభాగం నుండి ప్రధమ, ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు ఉంటాయని ఆసక్తి గలవారు తమ పేర్లను 1 వ తేదీ లోగా నమోదు చేసుకోవలని, రెండవ తేదీ ఉదయం 11:30 గంటలకు చిత్రలేఖన పోటీలు, మూడవ తేదీన ఉదయం 11.30 గంటలకు వ్యాసరచన పోటీలు, నాలుగో తేదీన ఉదయం 11 గంటలకు క్విజ్ పోటీలు ఉంటాయని ఆసక్తి గలవారు తమ పేర్లను వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని వివరాలకు 9396861308 నంబరును సంప్రదించాలని తెలిపారు.

